శ్లోకం: వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళ ముద్రిభ్రతే

       దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే

       పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్య మతన్వితే

       మ్లేచ్చాం మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణయ్య తుభ్యం నామః

రాగం: మోహన                                                    తాళం: మిశ్రచాపు  

జతి: తద్దిదీంద తాహత ధీనుత

      తద్దినుత తాహత నందణ

        తఝం తరిత తఝంఝంతరిత  

        తఝం తరిత ఝంతకరేకియ

        తడికు డిడికు డిడిడికు డింకుకు – 2

      తక్కిణనక తకుందరి కిటతక – 2

      తకుందరికుంద రికుందరి తకుందరి 

మత్సరమున మరియంబుధిలో – 4

జొచ్చియున్న సోమకుఅంబుధి  

జొచ్చియున్న సోమకుద్రుంచి

విచ్ఛలవిడి వేదము లజునకు – 2

ఇచ్చితివో మత్స్యావతార

వేదములిచ్చితివో మత్స్యావతార

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

జతి: తఝణుతా తగ్గిది తకుందరి

పలుమరు మిము ప్రస్తుతి చేయుచు – 2

చెలగి సురలు జలధి మధింపగ

అలిన సురలు జలధి మధింపగ

కలిమి బలిమి యాలమితో నోసగిన – 2

కులగిరి ధర కూర్మావతారా – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: కుకుందరికిట తరికిట కిటతక   

స్థిరముగా ధర నురవడి  చేకొని – 2

యురగ పదము యిరువుగ జొచ్చిన – 2

హిరణ్యాక్షు  బలిమార్చితివో – 2

వరసుగుణ వరాహరూప – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: ధంధంధణ ధాను తడింకుకు – 2

జాంభారి సురప్రముఖ కదంబంబును రక్షీంపంగ – 2

స్తంబంబున వేడలియు (సభ) – 2

దానవ డింబకు గాచితివో నరసింహ – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: తద్దిణుత తాహత ఝంతరి – 2

మనితముగ ముల్లోకంబులు – 2

తానొప్పుగ కాపాడంగ – 2

మనుగా మూడడుగులు బలిచే – 2

దానము గోను వామన రూప

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: తరిత తరిత దిరుగుడు తటకిటతక – 2  

తరిమి తరిమి ధరిణీ పతులను – 2

పరశువుచే దును మాడితివో – 2

వరవీర పరాక్రమమున ధరబరగితివో భార్గవ రామ – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: జగజగణకు జగణకు రేకిణ – 2

దశరధ తనయుడివై – 2

సురలకు వశము కానీ దశముఖు(ద్రుంచి) – 2

విశదముగ అయోధ్యకు సీతను వేంచెసితివో రఘురామ – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: తాకు తడికు తడింకు డేకుకు – 2

యాదవ వంశాబద్ధీ సుధాకర – 2 

ఆదిదేవు లనుజుడుగా గల – 3

మోదమొసగ ఖలులను ద్రుంచి – 2

మేదిని బరముడిపిన బలరామ (ఈ) – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: తకుం తరితఝం తకరేకిణ – 2

అంగనలకు సిగ్గడలింపగ – 2

అంగజ సమ రూపముతో – 2

రంగుణ పురకాంతల వ్రతములు – 2

భంగపరచు బుద్దావతార (వ్రతమున) – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

        

జతి: కిటకిటతక కిర్రట కిటతకధీం – 2

గాటపుకలి బాధలు మాన్వగ – 4

నీటుగ కరవాలము చేకొని – 2

ఘోటకమును ఎక్కి దురత్ముల – 2

గీటనచిన కల్కిఅవతారా (దురత్ముల) – 2

{తధణధణత ధిణకిటతక ధిన కిటతక } – నడక

 

జతి: జగకు నగకు ఝే.ఝే జగకిణ

సురల్ మేల్ మేలని పొగడగ – 5

నిరతము నీ దాసుల బ్రోవగ – 2

పరగ వ్యాఘ్ర పురమున వెలసిన – 2

వరదరాజ దేవా ఆశ్రిత సుర భోజాపరాక్

తాంగిటతక తరికిటతక   తరికిటతోం  తత్తరికిటతోం

త్తరికిటతోం – త ద్ధి తరికిటతోం – త ధి త్త తరికిటతోం

తరికిటతోం – 3

ధృగుడుత తకిట ఝంత – తరిద్ధణతా – తఝం ఝణుతా – తధీం ధీమి – 2

ధృగుడుత తకిట తక – తత కిటతక – 2

(ధృగుడుత తకిట – ధృగుడుత తకిట – త తకిట)-3  

ధృగుడుత- ధృగుడుత- ధృగుడుత- ధృగుడుత- తఝం

By admin