ధణత తద్ధిమి ధిమిత కిటతక -2

తాకు డేకు తడేకు కిణనక -2

అతరి తతధిమి ధిమిత కిటతక తాం  తెహి  దత్తతాం -3

రాముడున్న పురంబయోద్యని -2

భూమి నున్న జనంబు పొగడగ -2

వచ్చి అచ్చుత పురములో – 2

 బహుముచ్చటై న్న మంటపంబున -2

నిండు కొలువున వుండెను … – 2

 

 కోదండ పాణి జేయంతి దినమున -2       

సముకమందున సుముకులై -2

బాహుప్రముఖ   విద్వత్ జనము మ్రోలగ -2

తక్కతోయక దిక్కతోయక -2

చక్కగా ఎంతో చక్కగా  నవమిక్కిలీ నవ రసము తోను

భక్తుడౌ ప్రహ్లాద చరితము -2

భరతమందున నటన యటులన –2

హరిని గర్వము నణచవలనని  -2

అజునికోరి హిరణ్యకశిపుడు -2

తీవ్ర తపమునరీంచెను – 1

పగలు రాత్రాకాశ భూముల -2

మృగ మనుష్యూల ఇల్లు బయలన -2

ఆయుధంబుచే

ఆయుధంబుచే చావులేదని -2

హామీకై వరమడిగి  చేకోనీ -2

దేవ,బ్రాహ్మణ,ఋషులకు దినము బాధలు పెట్టుచు – 2

పుత్రునితో హరి మిత్రుడైన విచిత్రమేమని – 2

పాముచే కరూపింపమనగా 2

పామునెత్తుక పోయె గరుడుడు – 2

కాలకూట విషంబునివ్వగ 2

పాలుగా నవి పత్స్య మాయేనూ – 2 

జట్టి యుద్ధము చేయు వారలు – 2

జట్టి ప్రోగులై బడినటుండెను – 2

సాగరంబున త్రోయగా దరి గాట్టుచేరెను – 2

గిరులపై ఎక్కించి త్రోయగ హరి సతి వచ్చి ఆదుకోనెనూ – 2

 

ఎందునా భయమింత లేదురా యేమిరా ప్రహ్లాద నిన్నేమందురా

ఆ హరి ఎటులుండురా నా సముఖమందున చూపరాయని జగదమాడగా….

ఎందు చూచిన అందె గలడన – 2

కటకటంబడి భృకుటి ముడివడి గడియలో నిను మడియగోట్టేద

సుడియ హరి నీస్తంభమందున చూపమనగా……

ధగధగధగ ధగధగాయని ధగధగధగ ధగధగాయని

తరుణి కిరణము రీతిమెరయుచు – 2

ధర నృసింహం స్ధంభమంధున ఆవహించెనూ …. – 2

ఉగృడై శాత ఘోరాయుదముతోనే సంధ్య వేళ హిరణ్యకశిపుని

తడికు  డిండిం డిడికు డింకుకు

కడుపు చించియు వేగ వేగమే కడిగి జంధ్యముగా ధరించెనూ….

గార రక్తము జీర గోరల – 2

మీరి వడివడి కేకలేయగ – 2

లోకమెల్ల భీతిచే 2

గజగజా వానికెనూ…. 

హరిహరి శరణంచును ప్రహ్లాదభక్తుడు నమస్కరించెనూ

లక్ష్మీ వచ్చి సేవించేను.. తన వక్షస్ధలమును ఉంచుకొనెను

ఓ పరమభాగవతోత్తమా నీ భక్తికిప్పుడు మెచ్చితీనని

వరములిచ్చెను కరుణతోడుత ధరణినేలువెయ్యేళ్ళుయనుచుచు

అసురులందరు పొగడగ – 2

ప్రహ్లాదునకు పట్టముగట్టెనూ – 2

గరిమతో నరహరి వైకుంఠపురమునకేతెంచెనూ…. – 2

తాకిటతక తాతాకిటతక ఝేకిటతక ఝే ఝే కిటతక

తాకిటతక తధిగిణతోం – 3

ధింధిం తక తథొదింద   దింతాకిట తథొదింద      

ధింధిం తక తథొదింద తధిగిణత తధిగిణత తధిగిణత

By admin