జతి: (తధణ…. తఝణు….  తధణ  – తఝణు –

        తధణ తఝణు తత్తతరికిటతోం) – 2

               

తిరు తిరు జవరాల – 2

 తిరు తిరు జవరాల తి తి తి తి – 2

నీ తరలమైన నీ తరహార మధురే

తిరు తిరు జవరాల తి తి తి తి

నీ తరలమైన నీ తరహార మధురే…. తిరు తిరు జవరాల తి తి తి తి

-: స్వరం :-

సా సని సగస మగస సా సని మగస పమగస

సాసగాగమ గమపని పాపనినీస పనిసగా మాగసాని పమగాస

నిసగాగ సగమామ

-: స్వరం :-

ధిమిధిమకి తోంగ తోంగ ధిధిమిక్కి యారే మామరే పాత్రరావు మజ్జ మజ్జ – 2

కమల నాభుని తమకపుటింతి మీకి – 2

అమరే తీరుపు ఇదే అవధరించగదో                                                                                                         ||తిరు తిరు ||

-: స్వరం :-

ఝక ఝక్క ఝం ఝం ఝణకీణాని ప్రకటపు మురువొప్పు భళాభళా  – 2

సకల పతికి సరసపు కొమ్మ – 2

నీ ముఖసిరి మెరిసె చిమ్ముల మురిపెముగా                                                                                              ||తిరు తిరు ||

-: స్వరం :-

మాయి మయ్యి అలమేలు మంగా నాంచారి మతిబాయని వేంకటపతి పట్టపురాణి  – 2

మ్రోయ చిరు గజ్జెల నీమ్రోతాలనేని – 2

సోయగమైన నీ సొలగు చూపమరే                                                                                                            ||తిరు తిరు ||

తిరు తిరు జవరాల – 3 తి తి తి తి……

By admin