శ్లో॥ స్వాధీనపతికానైవ తధా వాసక సజ్జికా
విరహాత్కంఠితా ప్రోక్తా విప్రలబ్ధిచఖండితా
కలహాంతరితాచైన తధాప్రోషితభర్తకా
తధాభి సారికాచైవ మష్టధా నాయికామతాః ॥
తాత్పర్యం: స్వాధీనపతిక, వాసక సజ్జిక, విరహాత్కంఠిత, విప్రలబ్ధ ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తకు అభిసారిక అని నాయికా అవస్థలు ఎనిమిది.
స్వాధీన పతిక: నాయకుని చే ఎల్లప్పుడు ను సంతోషపరుపబడేడిది
వాసక సజ్జిక: ప్రియుడు వచ్చెడి సమయమందు తానలం కరించుకొని కేళీగృహము నలంకరించి సిద్ధమ గావుండునది వాసక సజ్జిక.
విరహాత్కంఠిత: నిరపరాధియగు ప్రియుడు రాక జాగు చేయగా కాలవిలంబనమును ఓర్వక ఎదురుచూచుచునుండు. నాయిక విరహత్కంఠితమనబడును
విప్రలబ్ద: ఒకానొక చోటును సంకేత స్థానముగ చెప్పి అక్కడ నాయకునిచే వంచింపబడి, అనగా అతడక్కడికి రాకపోగా మన్మధ పీడితురాలై యుండునది విప్రలబ్ధ
ఖండిత సంకేత సమయమును అతిక్రమించి అన్యోప భోగపు గురుతులతో ప్రాతః కాలమునందు వచ్చెడి నాయకుడు కలది ‘ఖండిత’ అనబడును.
కలహాంతరిత:-సఖుల యెదుట చరణ పతితుడగు నాయకుని నిరాకరించి పిదప పరితాప బడునది
ప్రోషిత భర్తృక :- నాయకుడు దేశాంతరము వెళ్ళినప్పుడు ఖేదపడునది ప్రోషిత భర్తృక అగును
అభిసారిక :- మదనానల సంతప్తయై తన స్థలమునకు నాయకుడు వచ్చునట్లు చేయుచున్నది గాని, లేదా నాయకుని సంకేత స్థలమునకు పోవుచున్నది గాని అభిసారిక
1. స్వాధీన పతిక :ప్రియో ప లాలి తానిత్యం స్వాధీనపతికామతా ।
అస్యాస్తుచేష్టాఃక ధితాః స్మర పూజోత్స వాదయః
వనకేళిజలక్రీడా కుసుమోపచయాద యః ॥
తా:- నాయకుని చే ఎల్లప్పుడు ను సంతోషపరుపబడేడిది. దీని వ్యాపారము మన్మ ధపూజా మహోత్సవము వన విహారము, జలక్రీడ, పుష్పాచయము
2. వాసక సజ్జిక :-ప్రియాగమన వేళాయాం, మండయంతీ ముహుర్ముహుః
కేళీగృహంతధాత్మానం, సాస్యాద్వాసక సజ్జికా
అస్యాస్తు, చేప్టాస్సంపర్క, మనోరధ విచింతనం
సఖీ వినోదో నితరాం ముహుర్ధూతీని రీక్షణం |
ప్రియాభిగమ, మార్గాభి, వీక్షా, ప్రభృతయోమతాః ॥
తా :- ప్రియుడు వచ్చెడి సమయమందు తానలం కరించుకొని కేళీగృహము నలంకరించి సిద్ధమ గావుండునది వాసక సజ్జిక. దీని వ్యాపారము నాయకుని సంపర్క మనోభీష్టమును యోచించుట, సఖులతోడి వినోదము సలుపుట, అడుగడుగునకు సఖినిసాభిప్రాయముగ చూచుట, నాయకుడు వచ్చెడి దారిని చూచుట మొదలగునవి.
3) విరహాత్కంఠిత :- అనాగసి ప్రియతమే, చిరయత్యు కతుయా। విరహోత్కంఠితా, భావ, వేదిఖి, పరికీర్తితా అస్వాన్లు, చేష్టాన్నంతాసో, వేపధుశ్చాంగసాధనా ! ఆరతిర్భాష్ట మోక్షశ్చ, స్వావస్థా, కథనాదయః ॥
తా:- నిరపరాధియగు ప్రియుడు రాక జాగు చేయగా కాలవిలంబనమును ఓర్వక ఎదురుచూచుచునుండు. నాయిక విరహత్కంఠితమనబడును.
దీని వ్యాపారము :- సంతాపము, దేహమువణకుట, చిన్నబోవుట, వ్యాపారాంతరములందు ప్రీతి లేకయుండుట, కన్నీరు విడచుట, తన అవస్థను చెలులకు తెలుపుట మొ||నవి.
4. విప్రలబ్ద: క్వచిత్సంకేతమా వేద్య తత్ర నాథేన వంచితా
స్మరార్తా విప్రలబ్దేతి, కధితా భావకోవిదైః॥
అస్యాస్తు, చేష్టా నిర్వేదశ్చింతాభేదో, దదీనతా
అశ్రు నిశ్వాస, మూర్ఛాద్యాః కథితా, భావవేదిభిః ॥
తా :- ఒకానొక చోటును సంకేత స్థానముగ చెప్పి అక్కడ నాయకునిచే వంచింపబడి, అనగా అతడక్కడికి రాకపోగా మన్మధ పీడితురాలై యుండునది విప్రలబ్ధ దీని వ్యాపారము : నిర్వేదము, చింత, ఖేదము, దీనత, కన్నీరు విడచుట, నిట్టూర్పు విడుచుట, మూర్చచెందుట మొజనవి.
5. ఖండిత
ఉల్లంఘ్య సమయం యస్యా ప్రియా, నన్యోపభోగవాన్
భోగాలక్ష్యాం కితః ప్రాత రాగ చ్చే త్సాహి, ఖండితా॥
అస్యాస్తు, చేష్టా నిశ్వాస తూష్టీం భావోశ్రుమోచనం
ఖేదబ్రాంత్య, స్ఫుటాలాపా ఇత్యాద్యా విక్రియామతః
తా: సంకేత సమయమును అతిక్రమించి అన్యోప భోగపు గురుతులతో ప్రాతః కాలమునందు వచ్చెడి నాయకుడు కలది ‘ఖండిత’ అనబడును.
దీని వ్యాపారము :- నిట్టూర్పు విడుచుట, పలుకకుండుట, కన్నీరు విడచుట, ఖేధపడుట, భ్రమించుట, మూల్గుట మొదలగునవి.
6. కలహాంతరిత:-
యాసభీనాంపురః, పాదపతితం, వల్లభం, రుషా |
నిరస్యపశ్చాత్త, పతి, కలహాంతరితా తుసా॥
అస్యాస్తుచేష్టా నిస్వాశ, భ్రాంతిహృత్తావసాధ్వసే
ముహుః ప్రలాపిత్వాధ్యా, శ్చేష్టా: ప్రోక్తామనీషిభిః
సఖుల యెదుట చరణ పతితుడగు నాయకుని నిరాకరించిపిదప పరితాప బడునది తగును. దీని వ్యాపారము :- నిట్టూర్పులను విడచుట, భ్రమించుట, మనస్తాపబడుట స్తందారు స్వాధ్వస భావములు గలుగుట, మాటిమాటికి ప్రలపించుట మొదలగునవి.
7. ప్రోషిత భర్తృక :-
దేశాంతరగతే కాంతే ఖిన్నా ప్రోషిత భర్తృకా !
అస్యాస్తు జాగరః కర్మ్యాం, నియత్తాద్యవ లోకనం ॥
మాలిన్యమనవస్థానం, ప్రాయశయ్యానిషేవణం
జాడ్య చింతా ప్రభృతయో, విక్రియాఃకధితాబుధై:
దేశాంతరము వెళ్ళినప్పుడు ఖేదపడునది ప్రోషిత భర్తృక అగును. దీని వ్యాపారము – నిదురలేకపోవుట, కృశించుట, ప్రియుని కొరకు శకునములు చూచుట, మలినమైయుండుట, నిలచిన చోట నిలువక పోవుట, ఎప్పుడూ పడుకొనియుండుట, ఏమియు తోచకయుండుట, చింత మొదలగునవి.
8. అభిసారిక :- మదనానల సంతప్తా, యాభిసార మతి ప్రియం
స్వయం వాఖీసరే ద్యాతు, సాభవేదభిసారికా
అస్యాస్సంతాప చింతా ధ్యవిక్రియా స్స్యుర్యధోచితం||
తా; మదనానల సంతప్త యైతన స్థలమునకు నాయకుడు వచ్చునట్లు చేయుచున్నది గాని, లేదా నాయకుని సంకేత స్థలమునకు పోవుచున్నది గాని అభిసారిక అగును. దీని వ్యాపారము:- సంతాపం, చింత మొదలైనవి.