ఎవ్వడే వాడు……………
ఎవ్వడే వాడు ఓ భామ…….. ఎవ్వడే వాడు అతడు…….. – 2
ఎవ్వడే వాడు నే పవ్వలించిన వేళ – 2
పువ్వు బాణము వేసి రవ్వ చేసి పోయే – 2
|| ఎవ్వడే ||
{గరితా నె వానికి సతమా……
నన్ను గర్థించి పలుకుట ఉచితమ } – 2
పురుషుడు ఊర లేని ప్రోద్దుమాపటివేళ – 2
సుద్దుల తేలించి ముద్దు పెట్టుకుపోయే – 2
|| ఎవ్వడే ||
{నీల మేఘ శ్యామలాంగుడు
మంచి మేలైన పితాంభర ధారుడు} – 2
లీలతో పదియారు వేల గోపస్త్రీ – 2
ఏలిన మా మువ్వ గోపాలుడ అని పోయే – 2