పాత్ర
శ్లో: తన్వీ రూపవతీ శ్యామ పీనోన్నతపయోధరా
ప్రగల్భా, సరసాకాంతా కుశలాగ్రహ మోక్షయోః
చారి తాళ లయాభిజ్ఞా మండలస్థాన పండితా
హస్తాంగ స్థాననిపుణాకరణేషు విలాసినీ
విశాల లోచనాగీత వాద్య తాళానువర్తినీ
పరార్థ్య భూషా సంపన్న ప్రసన్న ముఖపంకజా
నాతి స్థూలా నాతి కృశానాత్యుచ్ఛా నాతివామనా
ఏవం విధ గుణోపేతా నర్తకీ సముదీరితా ।
తాత్పర్యము:- సన్ననిది, రూపవతి, నడిమి యౌవనంలో ఉన్నది. గుండ్రని పాలిండ్లు కలది. ప్రౌడ చమత్మారి, మనోహారిణి, నృత్యము నందలి పట్టు – విడుపులు తెలిసినది, చారుల తాళలయల ప్రయోగము తెలిసినది మండల ప్రయోగములో పండితురాలు, హస్త – అంగ విన్యాసాలలో నిపుణురాలు, కరణములను సునాయాసముగా నిర్వహింపగలది, అందమైన పెద్ద కన్నులు కలది, గీత – వాద్య తాళాలను అనుసరించి నృత్యము చేయగలది, శ్రేష్టమైన నగలతో కూడినది, పద్మము వలే ప్రసన్నమైన ముఖము కలది. ఎక్కువ లావుగా కాని, ఎక్కువు సన్నగాకాని, ఎక్కువ ఎత్తుగా కాని, ఎక్కువ పొట్టిగా కాని, లేనిది. యిటువంటి గుణాలు కలిగిన స్త్రీ నర్తకి అని చెప్పబడినది.
అపాత్ర
శ్లో: పుష్పాక్షి కేశహీనావ స్టూలోప్లే లంబితస్తనీ
అతి స్థూలాష్యతికృతా అత్యుచ్చావ్యతి వామనా
కుబ్జాద స్వరహీనాచ వేశ్యా నాట్య వర్ణితా।
తాత్పర్యము :- కంటిలో పువ్వు వున్నది, జుట్టు లేనిది, లావుగా వున్న పెదవులు కలది, జారిన స్తనాలు కలది, బాగా లావుగా వున్నది. బాగా సన్నగా వున్నది. బాగా పొట్టిగా వున్నది, గూను కలిగినది, కీచు కంఠం కలది, ఈ లక్షణాలు కలిగిన వారు నాట్యమునకు అనర్హులు. మరియు వేశ్య నాట్యానికి పనికిరాదు.
కింకిణి లక్షణము
శ్లో: కింకిణ్యః కాంస్యవిరచితాః ఏకైకాంగులి కాంతరం
సుస్వరాశ్చ సురూపాళ్ళు సూక్షా నక్షత్ర దేవతా
బన్నీ యాన్సీల సూత్రేణ గ్రంధి భిశ్చ దృఢంపునః
శతద్వయంశతం వాపిపాదయోః నాట్యకారిణీ
తాత్పర్యము:- పాత్రము ధరించే గజ్జెలు- కంచువి, ఒక్కొక్క అంగులి దూరం వుండునట్లుగా కట్టబడినవి. మంచిస్వరం కలవి, అందమైనవి, చిన్నవి, నక్షత్ర దేవతకములు కావలెను. ఇటువంటి గజ్జెలు రెండు వందలు లేదా ఒక వంద చొప్పున నీలపు రంగు సూత్రముతో నర్తకి తన పాదములందు గట్టిగా కట్టుకోవలెను.
సభ లక్షణము:
శ్లో॥ సభా కల్ప తరుర్భాతివేదశాఖోప శోభితః
శాస్త్ర పుష్ప సమాకీర్ణో విద్వదృమర శోభిత
తాత్పర్యము:- సభ అనే కల్ప వృక్షము – వేదాలనే శాఖలతో శోభిల్లుచున్నది. శాస్త్రాలనే పుష్పాలతో నిండినది. విద్వాంసులనే భ్రమరాలతో ప్రకాశిస్తున్నది.
శ్లో॥ సత్యాచార సభా గుణోజ్వల సభా సద్ధర్మ కీర్తి స్సభా ॥
వేదాలంకృతరాజపూజిత సభా వేదాంత వేద్యా సభా॥
వీణా వాణివిశేష లక్షిత సభా విఖ్యాత వీరాసభా॥
రాజద్రాజ కుమార శోభిత సభా రాజత్ప్ర కాంతి స్సభా
తాత్పర్యము :- సదాచార పరులు కలది, సద్గుణాలతో ప్రకాశించేది, ధర్మమునకు పట్టుకొమ్మ అనే కీర్తి
|| కలది. వేద ఘోష కలది, రాజుల చేత గౌరవింపబడేది, వేదాంత చర్చలుకలది. తేజోవంతులైన రాజ కుమారులు. కలది. ఇన్ని గుణాలు కలదై తేజస్సుతో ఒప్పునది సభ అనబడుతుంది.
శ్లో॥ విద్వాంసః కవయోభట్టా గాయకః పరిహాసకాః
ఇతిహాస పురాణజ్జో సభా సప్తాంగ లక్షణమ్.
తాత్పర్యము :- పండితులు, కవులు, శాస్త్రకారులు, గాయకులు, పరిహాసకులు, ఇతిహాసజ్ఞులు, పురాణవేత్తలు ఈ ఏడుగురు సభకు ఏడు అంగాలు. కావుననే సభ సప్తాంగ లక్షణములతో కూడియున్నది.