శ్లో॥         ఉద్ఘట్టితః సమంచైవ తధాగ్రతల సంచార
అంచితః కుంచితః సూచీపాదః షోధాః ప్రకీర్తితః

1. ఉద్ఘట్టితము : వ్రేళ్ళపై నిలిచి, మడమ లతో భూమిని అదుముచుండుట ఉద్ఘట్టితపాదము.

2. సమము: పాదములను భూమియందు సహజముగా వుంచుట సమపాదము అనబడును.

3. అగ్రతల సంచారము: మడమను పై కెత్తి వ్రేళ్ళను అంచితములను చేసి అంగుష్టముతో ముందుకు సాగుట అగ్రతల సంచార పాదము అనబడును.

4. అంచితపాదము : మడమలను నేలపైయుంచి పాద తలములను పైకెత్తి అన్ని వ్రేళ్ళను చాచి నడచుట అంచిత పాదము అనబడును.

5. కుంచితము : మడమను పైకెత్తి వ్రేళ్ళను బాగుగాను మధ్య భాగమును కొంచెముగాను ముడుచుట కుంచిత పాదము అనబడును.

6. సూచీపాదము: దక్షిణ పాదము యొక్క అంగుష్టము చివర నిలిచి మడమను పైకెత్తి వామ పాదమును స్వభావసిద్ధముగా వుంచుట సూచీపాదము అనబడును.

By admin