పల్లవి: భామనే……….. సత్యభామనే……….. భామనే……….. సత్యభామనే………..
అనుపల్లవి: వయ్యారి ముద్దుల వయ్యారి
చరణం: భామనే పదిహారు వేల కోమలు లందరిలోన
లలనా……చెలియా……మగువ……..సఖియా……..
రామరో గోపాల దేవుని ప్రేమను దోచినదాన
చరణం: ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జానతనమున సతులలో నెరాజణనై వెలిగేటిదాన
||భామనే||
చరణం: అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై
నందనందను డెందుగానక డెందమందున కృంగుచున్న
||భామనే||
చరణం: కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన
నాదు మగనిని బాసి తాళజాలక యున్నట్టిదాన
||భామనే||