భావము – విభావము – అనుభావము – స్థాయిభావము – సంచారీభావము/వ్యభిచారీ భావము

భావము:

“భావయంతి ఇతి భావాః” – అని ఆర్యోక్తి .

అనగా వాచిక – ఆంగిక – సాత్వికాభినయములతో నర్తకి / నర్తకుడు రూపకములలోని అర్ధాలను భావింపచేయుట వలన “భావము” అనబడింది.

విభావము:

విశిష్ట జ్ఞానహేతువు అయినది విభావము అనబడినది. రసమును నటుడు అనుభవించడానికి హేతువయిన సందర్భం విభమగును.  అనగా ఒక రసమును నటుడు (సహనటుడు) వాచిక – ఆంగిక – సాత్వికాభినయములను విశిష్టముగా తెలుసుకొనబనవి కవునా విభావములు అనబడినవి.

అనుభావము:

అంగ, వాక్కు, సత్త్వకృతమైన అభినయము అనుభవయోగ్యగా ఉండును.  కావున అది అనుభవము అనబడినది. (రంగముపై నటుడు తాను ఒక సందర్భమును అనుభవించునపుడు ప్రతిస్పందన సకాలములో వ్యక్తమవుతుంది.  అలా అనుభవయోగ్యమైన సందర్భాలు కావునా  వాటిని అనుభములు అన్నారు.)

స్థాయీభావము:

రసము పండుటకు అత్యంత ప్రధానమైన స్థాయీభావము. ఈ స్థాయీభావములు రసత్వమును పొందుట వలన భావము ఏర్పడుతుంది. అంతవరకు స్థిరంగా ఉంటుంది. గనుక దీనిని స్థాయీభావము అని అంటారు.

ఇవి :

రసము                                        స్థాయీభావము

శృంగారం                                      రతి

హాస్యము                                      హాసము

కరుణము                                     శోకము

రౌద్రము                                       క్రౌధము

వీరము                                          ఉత్సాహము

భయనకము                                  భయము

భీభత్సము                                    జుగుప్స

అద్భుతము                                   విస్మయము

శాంతము                                      శమము

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *