స్వీయ, పరకీయ, సామాన్య నాయికా లక్షణములు

స్వీయ

సంపత్కాలే విపత్కాలే యానముంచతి వల్లభం

శీలార్జవ గుణోపేతా సా స్వీయా పరికీర్తితా

ముగ్ధామధ్యా ప్రగల్భేతి త్రేధాసాతు నిగద్యతే

శీలము, ఆర్జనము, మొదలగు సద్గుణములు కలిగి, సంపత్కాలమునందును, విపత్కాలమునందును, నాయకుని విడువక యున్నట్టి స్త్రీ స్వీయ అనబడును. ఇందు ముగ్ధ – మధ్య- ప్రగల్భయని మూడురకములు కలవు.

పరకీయ:-

శ్లో॥పరానురాగ వ్యాపారే గోపనే దత్తమానసా |

పరకీయేతి సాప్రోక్తా భరతాగమవేదిభిః ॥

సాచకన్యా పరోఢేతి ద్వివిధా పరికీర్తితాః॥

తా: పరపురుషుని యందు గల ఇచ్చ వ్యాపారములను మరుగుపరచుట యందు, దత్తచిత్తురాలైయున్న నాయిక ‘పరకీయ’ అనబడును. ఇది కన్య, పరోఢ అని రెండు విధములు.

సామాన్య :-

శ్లో ॥ సామాన్యాచైవర్యగణికా ప్రాగల్భ్య ధర్షయుత్ ||

విత్తమాత్రా శయాలోకే పురుషేష్పునురాగిణీ ॥

యే తస్సాను రాగ స్యాద్గుణ వత్యపి నాయకే!

భగ్న కామాన తార్ధక్ బాల పాషండ షండకాన్ II

రక్తే వరం యేన్నిత్యం నిశ్వానాకు నివాసయేత్ |

తస్యాదౌత్యప్రభృత యోగుణాస్త్రదుపయోగినః ॥

తా:- సంగీతము, అభినయము మొదలగు విద్యా ప్రాగల్భ్యము ధైర్యము కలదిగాను, జనులయందు ధనాశ చేతనే అనురాగము గలదిగాను నుండు నది ‘సామాన్య’ అనదగును. ఇదే గణిక, ఈనాయికకు నాయకుడు గుణవంతుడైనను, ధనాగమనము లేకున్నా వాని యందు ప్రేమ, కలుగదు. ధనాశ లేనివారు, భగ్న కాముకులైనను, బాలురైనను, పాషండులైనను, షండులైనను, వారలయందు ప్రేమ గలవాని వలెనే వారిని సంతోష పరచును. పైన చెప్పిన వారు కపట మెరుగని వారుగనుండవలెను.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *