జాతి

జాతి

సంఖ్య

అక్షరములు

తిశ్ర

3

తకిట

చతురస్ర

4

తకధిమి

ఖండ

5

తక తకిట

మిశ్ర

7

తకిట తకధిమి

సంకీర్ణ

9

తకధిమి తక తకిట

తాళం

ఇది కాలము యొక్క కొలమానం. కొన్ని అంగముల ద్వారా కాలాన్ని కొలుస్తారు.

శ్లో:       తకారం శంకర ప్రోక్తం లకారం శక్తి రుచ్యతే

శివ శక్తి సమాయోగ తాళనలిదీయతే

పరమేశ్వరుని తాండవం, పార్వతి దేవి లస్యముల కలయికగా తాళము అనే శబ్ధం ఏర్పడినది. తాళము యొక్క ఏర్పాటు కొన్ని అంగముల కూర్పు వలన జరుగును. అవి ఆరు తాళాంగములు, వాటినే తాళషడాంగములు అంటారు.

తాళాంగములు –

అంగము          సంజ్ఞ              చేయు విధానం

  • లఘువు ( | )              ఒక దెబ్బ కొట్టి వేళ్ళను  లెక్కించుట)(జాతిని బట్టి మారును)
  • అనుధృతము ( C )                      ఒక దెబ్బ కొట్టుట
  • దృతము ( O )                     ఒక దెబ్బ కొట్టి చేయి విసరుట
  • గురువు ( 8 )                      2 లఘువులు
  • ఫ్లుతము ( 81 )                     3 లఘువులు
  • కాకపాదము ( + )                     4 లఘువులు
సప్త తాలములు

తాళం             సంజ్ఞ             

ధృవ              | 0 | |

మఠ్య              | 0 |                   

రూపక            0 |                                  

ఝంపే            | C 0                      

త్రిపుట                    | 0 0                                     

అట                         | | 0 0

ఏక                          |

సప్త తాళకర్తలు

సప్త తాళములు అనేక మంది మహానుభావులు సంయుక్త కృషి వలన ఏర్పడినవి.

దృవతాళకర్తలు : భరతో దత్తిళశ్చైవ ఆంజనేయోమతోధృవః

తాత్పర్యము :- భరతాచార్యులును, దత్తికుడు, ఆంజనేయుడు కలిసి దృవతాళమును ఏర్పరచిరి.

మఠ్య తాళకర్తలు : మఠ్యతాళస్య కర్తారో మతంగార్జున కోహళాః

తాత్పర్యము:- మతంగ మహాముని, అర్జునుడు, కోహళాచార్యుడు కలిసి మఠ్యతాళమును రూపొందించి

రూపక తాళ కర్తలు : ఆంజనేయః కుంభజోపి యాజ్ఞవల్క్యస్తు రూపకే

తాత్పర్యము:- ఆంజనేయుడు, కుంభజుడు (అగస్త్యుడు) యాజ్ఞవల్క్యుడు కలిసి రూపక తాళమును ఏర్పరచినారు.

ఝంపె తాళ కర్తలు : నందీశో భరతో శౌనః ఝంపాయాం చైవ సప్తధా

తాత్పర్యము:- నందికేశ్వరుడు, భరతుడు, శౌనకుడు, కలిసి ఝంప తాళమును రూపొందించిరి

త్రిపుట తాళ కర్తలు : నిశాచరపతిః బ్రహ్మా త్రిపుటే శంఖ పాలకః

తాత్పర్యము:- రావణుడు, బ్రహ్మ, శంఖ పాలుడు, కలిసి త్రిపుట తాళమును రూపొందించిరి.

అటతాళ కర్తలు : బలి: కౌమార దేవేంద్రౌ  అటతాళ సముద్భవః

తాత్పర్యము:- బలిచక్రవర్తి, దేవేంద్రుడు, కుమారస్వామి, మొదలగు వారు అటతాళమును రూపొందించిరి.

ఏకతాళ కర్తలు : మహతాంచాపి సర్వేషాం ఏకతాళ సమం విదుః

తాత్పర్యము:- సమస్తమైన వారి మతాల ప్రకారము ఏకతాళము రూపొందించబడినది.

ఈ ఏడు తాళములు ఐదు జాతులతో కూడి ముప్పది ఐదు తాళములు ఏర్పడుచున్నవి.

35 తాలముల పట్టిక

జాతి/తాళం

ధృవ(1011)

మఠ్య(101)

రూపక(01)

ఝంపే(1C0)

త్రిపుట(100)

అట(1100)

ఏక(1)

తిశ్ర (3)

మణి

3+2+3+3

సార

3+2+3

చక్ర

2+3

కదంబ

3+1+2

శంఖ

3+2+2

గుప్త

3+3+2+2

సుధ

3

చతురస్ర (4)

శ్రీకర

4+2+4+4

సమ

4+2+4

పత్తి

2+4

మధుర

4+1+2

ఆది

4+2+2

లేఖ

4+4+2+2

మాన

4

ఖండ (5)

ప్రమాణ

5+2+5+5

ఉదయ

5+2+5

రాజ

2+5

చణ

5+1+2

దుష్కర

5+2+2

విదళ

5+5+2+2

రత

5

మిశ్ర (7)

పూర్ణ 7+2+7+7

ఊదీర్ణ 7+2+7

కుల

2+7

సుర

7+1+2

లీల

7+2+2

లోయ 7+7+2+2

రాగ

7

సంకీర్ణ (9)

భువన 9+2+9+9

రావ

9+2+9

బిందు

2+9

కర

9+1+2

భోగ

9+2+2

ధీర 9+9+2+2

వసు

9

By admin