పల్లవి:

కర్ణాటక సంగీతంలోని కీర్తనలు, కృతులు వంటి ఏ రచనలోనైనా మొదట వచ్చే భాగం పల్లవిగా చెప్పబడుతుంది. ఇది పాటలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు రావడం మరియు అనుపల్లవి, చరణముల తర్వాత పదే పదే పాడటం వలన పాటలోని పల్లవి బాగా గుర్తుండిపోతుంది.

అనుపల్లవి:

 ఏదైనా పాటలోని పల్లవి తర్వాత వెంటనే వచ్చే భాగం అనుపల్లవి. ఇది సాధారణంగా పల్లవి, చారణముల మధ్యభాగంగా ఉంటుంది. కృతులలో అనుపల్లవిని ప్రత్యేకంగా గమనించవచ్చును.

చరణం:

 సాధారణంగా పాటలో అనగా కీర్తన, కృతులలో పల్లవి, అనుపల్లవి తర్వాత వచ్చేది చరణం. ఇది పాటలోని చివరి భాగంగా ఉంటుంది. ఒక పాటలో ఒక పల్లవి, ఒక అనుపల్లవి ఉంటుంది కానీ చారణములు మాత్రం సాధారణంగా 3 లేదా 5 ఉంటాయి.

ఆలాపన:

 మనోధర్మ సంగీతంలో ఆలపణకు ప్రాధాన్యత ఎక్కువ. ఒక పాటలోని భావాన్ని ఆస్వాదిస్తూ హాయిగా మధురంగా దీర్ఘంగా రాగం తీయడం ఆలాపన అంటారు. సంగీతములో స్వరాలపన ఒక భాగం. నాటకాలను చూసినప్పుడు వాటిలో సనదర్బాన్ని అనుసరించి కొన్ని రాగాలపనలను మనం గమనించవచ్చును.

By admin