Slokas

RUDRA PUBLICATIONS

నర్తన శ్లోక సంహితం

శ్లోకాన్ని చదవండి · అర్థం తెలుసుకోండి · ఆడియో వినండి · వీడియో చూడండి

సంఖ్యశ్లోకం & అర్థంఆడియోవీడియో

నాట్యం అనేది కేవలం శారీరక కదలికల అంగాంగ విన్యాసం మాత్రమే కాదు; అది అంతరంగ భావనల అభినయ యజ్ఞం. భరతముని, నందికేశ్వరుల వంటి మహనీయులు మనకు అందించిన ‘నాట్యశాస్త్రము’, ‘అభినయదర్పణము’ మొదలైనవి కేవలం పఠన గ్రంథాలు కావు; అవి ప్రతి నర్తకుని అభినయ కౌశలాన్ని శాసించే ప్రాణ సూత్రాలు. నేటి ఆధునిక కాలంలో, కూచిపూడి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులు అభ్యసిస్తున్న ఎంతో మంది విద్యార్థులు కేవలం ప్రాయోగిక (Practical) సాధనకే పరిమితమవుతున్నారు. నాట్యానికి మూలస్తంభాలైన సిద్ధాంత శ్లోకాల నిగూఢ అంతరార్థాలు చాలా మందికి కేవలం పరీక్షల కొరకు చదివే అక్షరాలుగానే మిగిలిపోతున్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ, విద్యార్థి దశలోనే శాస్త్రంపై పట్టు సాధించే దిశగా, కూచిపూడి సర్టిఫికేట్, డిప్లొమా స్థాయిలలో ఖచ్చితంగా తెలియవలసిన 138 నాట్య సంబంధిత శ్లోకాలను సరళమైన తెలుగు వివరణతో ఈ “శ్లోక సంహితం” మీ ముందుకు తీసుకురావడం జరిగింది. శాస్త్రాన్ని అనుసరించని నాట్యానికి రససిద్ధి కలగదు. ఈ పుస్తకంలోని శ్లోకాలను క్షుణ్ణంగా అవగతం చేసుకోవడం ద్వారా విద్యార్థుల నృత్య ప్రదర్శనలలో కూడా మార్పులు సుస్పష్టంగా కనిపిస్తాయి అని నా నమ్మకం. ఈ webpage నందు ఆడియో మరియు YouTube లింకులు, ఉచ్ఛారణ మరియు ఏ ఇతర విషయాలలో తప్పులు దొర్లాయి అని అనిపించినా దోషజ్ఞులు తెలిపినచో సరిచూసుకొనగలవారము.