నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబుపైజల్లేడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో!మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే!