జతి: దందణ ధిందిమి ధిమితదికు – 2
తద్ధికు తకుంతకుం తత్తతరి తరితరి
తత్తారితకుం తతతరి కిణనక
తక్కిణాంత తక్కిణాంత కిటతక ఝం – 2
తత్త ధిధి నంగుడు తత్తక నంతరి ఝంతరి కుంతరి కిటతక – 2
తకిట తకిట తకిట తకిట తకిట
త త్తరికిటతోం – 3
పల్లవి: దశరధవర కుమారుడవైతివి – 12
దైవ కౌశి యాగము కాచితివి – 2
రసికుడ సీతను పెండ్లాడితిని – 2
రవికులమున బలవంతుడవైతివి – 2
జతి: ఝంతగిణాంతరి జాజాగదిదిం – 2
అంతట వనవాసము జేసితివి – 3
ఆడిన మయమృగ వెంబడిబోతివి – 2
చింతిత ఇది మన వశమనుకుంటివి – 2
జతి: ధీను దణంతక ధిత్తకిణాంతరి – 2
జఠాయు తెలుపగ వినుమని అతనికి – 2
చెడని పదవిగా నొసగెను వెనుక – 2
జతి: తత్తహిత్త హిత్త త్తాం తత్తహిత్త తదిగిణతోం – 2
హనుమంతుని చే అభయమొసగితివి – 2
అల సుగ్రీవుని ఆదరించితివి – 2
జతి:తతరి తరిత కిణ తరిత తరిత ఝం
తరిత తరిత ధణ తరిత తరిత ఝం
జయముగ వృక్షము చాటున నుంటివి – 2
శరమున వాలిని కూలనేసితివి – 2
జతి: హుంతక ణాంతక హుంతణాంత తక – 2
వానర సేనల దండు కూర్చితివి – 2
వారది గట్టిగ బందించితివి…….. – 2
జతి: దాగది గదిదిం దాదా గదిదిం – 2
శరణని వచ్చిన వాని గాచితివి – 2
హరి హరి హరి రణ బిరుదు గట్టితిని – 2
జతి: తక్కిట కిటతక తాకిటకిటఝం – 2
అసురుని కులమెల హతము జేసితివి – 2
అరయ తమ్మునకు అభయమొసగితివి – 2
జతి: దం దం దణదణ దానుదణందణ – 2
లంకకెక్కి ఆ లంక కూల్చితివి – 2
అగ్గలించి రావణు దుంచితివి – 2
జతి: తదిమి తకిట తక ఝణుతరికిటతక -2
పట్టము గట్టి విభీషణు లంకలో – 2
పెట్టి వెడలితివి సీత సమేతుడవై – 2( లంకలో )
అట్టి అయోద్య పట్టణమున మరి – 2
పట్టభద్రుడై ప్రబలిన రామా – 2
దిట్టముగా పెరుందేవిని గూడియు – 2
గట్టిగ భక్తుల పట్టి శుభములన్ – 2
కట్టడి చేసిన కరి వరద
పెట్టెద పదివేల సాష్టాంగ దండము పెంపుగ చూడుము
పరాకు రామ పరాకు రామ పరాకు లేకను
నాదిరి దిరిదిరి నంనం దిరిదిరి తాతా దిరిదిరి తళంగు తదిగిణ
జతి: తాంత తతరి తాం – 2
తత్త దింద – 2
తత్త త దింద – 2
తత్త తత్త దింద – 2
తత్త తత్త దింద తత్త దిందదింద – 2
తరికిటత దింద – 2
తరికిట తరికిట దింద – 2
తరికిట తరికిట తరికిట తరికిట తత్త దింద -2
తరికిట తరికిట దింద – 2
తరికిట దింద – 2
తకతరికిటతక
ధిం ధిం ధిం ధిన్నకిటతక ధిం – 2
ధి ధి ధిన్నకిటతక – 2
ధి ధిన్నకిటతక – 2
ధిన్నకిటతక – 2
తధిత్త ధిత్త తధిత్త ధిత్త ధిత్త ధిత్త
తధి తఝం తధిగిణత
ధి తఝం తధిగిణత
తఝం తధిగిణత
తధిగిణత – 2
తధితఝం తకతధిగిణత
ధితఝం తకతధిగిణత
తఝం తకతధిగిణత
తకతధిగిణత – 2
తధితఝం తకధికు తధిగిణత
ధితఝం తకధికుతధిగిణత
తఝం తకధికుతధిగిణత
తకధికుతధిగిలణత – 2
నడక………………
