నారాయణ తీర్థులు – జీవిత చరిత్ర

శ్రీనారాయణ తీర్థ యతీంద్ర సద్గురు స్వాములవారు ఆంధ్ర దేశమున గుంటూరు మండలమున మంగళ గిరి క్షేత్రమునకు సమీపమునగల ‘కాజ’ అను గ్రామము నందు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వీరియింటి పేరు తల్లావఝుల వారు. వీరి పూర్వనామము గోవింద శాస్త్రి, కాలము 15, 16వ శతాబ్దముల వారు అని కొన్ని చారిత్రక ఆధారములను బట్టి తెలియుచున్నది.
విద్యాభ్యాసము:- వీరి గురువు వాసుదేవ పండితులు. తీర్థులవారికి దైవభక్తి జన్మతోనే లభించినది.
విద్యనభ్యసించుటకు బదులు ఆ సమయమున దైవపరముగా కొన్ని కీర్తనలను గానము చేసికొనుచు అందు తన్మయులగు చుండెడివారట. వీరు ప్రతినిత్యము ఊరి చివర యందుగల ఒక చెట్టుక్రింద కూర్చుని కీర్తనలను గానము చేయుచుండెడి వారట. ఒకనాడు మిగిలిన విద్యార్థులందరు కలసి గురువు గారిని సమీపించి గోవింద శాస్త్రి వేద శాస్త్ర విద్యను విస్మరించి గానము చేయుచుండెనని ఫిర్యాదు చేసిరి ఆ తరువాత గురువుగారు శిష్యుడైన గోవిందశాస్త్రిని పరీక్షించుని మిత్తము ఒకనాటి వేకువ ఝామున గోవింద శాస్త్రి గానము చేయు చెట్టును సమీపించి చెట్టుపై కూర్చుని శిష్యుని రాకకై ఎదురుచూచు చుండెను. గోవింద శాస్త్రి కొద్ది సేపటికి విచ్చేసి అపారగానా మృతమును ఆలపించుచుండగా తన్మయుడై గురువు గారు చెట్టుదిగి వచ్చి శిష్యునితో నీవే నాకు గురువు నీలోని అపార భక్తి మాధుర్యములు నన్ను ఎంతో ముగ్ధుడను గావించెనని నమస్కరించెనట. తరువాత గురువుగారు మిగిలిన శిష్యులందరికి గోవింద శాస్త్రి సామాన్యుడు కాదు, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు అతనికి జన్మతోనే లభించినవి అని అంతకు ముందు తాను చెట్టు పైనుండి శిష్యుని పరీక్షించిన విధమును వెల్లడించెనట.
సన్యసించుట :- గోవింద శాస్త్రి అత్తవారి పూరు కృష్ణా నదికి ఆవలి ఒడ్డునగల వేదాద్రియను దివ్యక్షేత్రము. ఒకనాడు గోవింద శాస్త్రి అత్తవారి పూరు వెళ్ళుటకు నదిని దాటు చుండెను. సగము దూరము వెళ్ళునప్పటికి ప్రవాహము అధికమై ప్రాణాపాయస్థితి కలుగుటచే గత్యంతరము లేక మానసికముగా ఆతుర సన్యాసమును స్వీకరించిరి దైవికముగా అంతలో చేతికి ఆలంబనము దొరకగా ఒడ్డునకు చేరిరి. అత్తవారింటికి వెళ్లగా అత్తగారుచూచి తన కుమార్తెతో నీ భర్త వచ్చినారు. పాదప్రక్షాళనకు నీరు తీసుకుని వెళ్ళమని చెప్పెను. గోవింద శాస్త్రి భార్య ఉదకమును తీసుకొని రాగా ఆ మహాపతివ్రతకు గోవింద శాస్త్రి ఒక సన్యాసిగా కనిపించెను. వెంటనే తల్లి వద్దకు వెళ్ళి ఈయన ఎవరో సన్యాసిగాని తన భర్త కాదని పలికెను తన భార్య మహాపతివ్రత అయినందున తాను నదిలో ఆతురు సన్యాసము తీసుకొనిన విషయమును గ్రహించినదని తెలుసుకొనుట లన భార్యకు జరిగిన విషయమును తెలిపి ఆవిడ అనుమతి తీసుకొని తన జన్మస్థానమైన కాజకు వెళ్ళి తన సోదరులకు బంధువులకు విషయమును చెప్పి కాశికి వెళ్ళి అక్కడ శ్రీరామానందుల వారి వద్ద యతిదీర్ఘ స్వీకరించెను.
కాశివాసము :- తీర్థులవారు కాశీక్షేత్రమున వుండినప్పుడు ఏడు యిండ్లకు వెళ్ళి బిక్షము తెచ్చుకొని ఒకగదిలో ఆహారమును తీసుకొనుచుండెడివారు. నిరంతరం కృష్ణ భగవన్నామస్మరణను గానము చేయుడు తన్మయులగుచుండెడివారు. వీరుగానము చేయుచుండ కృష్ణ పరమాత్మ బాలుని రూపమున నృత్యమ చేయుచుండెను. తన ధ్యానమునకు యితరులవలన భంగము ఏర్పడునని తలుపులు వేసుకొని చేసెడివారు. గదినుండి తీర్థులవారి గానము కాకుండా మద్దెల, గజ్జెల తాళముల ధ్వనులు వచ్చు చుండెడివి సమీపమున నున్నవారికి కొంత అనుమానము ఏర్పడి లోపల కొందరు స్త్రీలతో తీర్థులవారు కాలక్షేపము చేయుచుండెనని భ్రమపడి ఆయనకు భిక్ష వేయుట మానిరి. నిరంతర భగవన్నామ సంకీర్తనతో నిమగ్యులైన తీర్ధుల వారికి ఆజగజ్జనని వచ్చి ఆహార మిచ్చుచుండెడిది. కొంత కాలమునకు యిరుగుపొరుగువారు తమ అజ్ఞానమునకు చింతించి తీరులవారు దైవాంశ సంభూతులనిగ్రహించి వారిని భక్తి శ్రద్ధలతో పూజించెడి వారు.
తీరులవారు గంగకు స్నానమునకు వెళ్ళునప్పుడు వారి వద్ద నుండి చందనపు వాసన వచ్చుచుండెడిది. అందుకు కొందరు తీర్ధులవారు భోగలాలసుడని సంశయించి రాత్రి సమయమున యింటి పై కప్పును కొంత తొలగించి రంధ్రము చేసి చూడగా తీర్థులవారు గానము చేయుట, కృష్ణుడు గోపికలతో ఆడుచుండుట చూరి. ఆశ్చర్యానందములతో మరునాడు తీర్థులవారిని సమీపించి తాము చేసిన అపరాధమును మన్నించుడుని తరణు వేడిరి. భగవత్ సాక్షాత్కారము లభించుట మా అదృష్టమును వారిని ఆశీర్వదించెను.
తీర్థులవారి గ్రంధములు :- శ్రీ కృష్ణలీలా తరంగిణి తీర్థులవారు శ్రీమద్భాగవతము నందలి దశమస్కందము పూర్వభాగము రుక్మిణీ కళ్యాణాంతములు కలవు (అందు ఒక్కొక్క భాగమునుగ) తీర్థులవారు తరంగములు అని పేర్కొనెను. తరంగము అనగా అల తరంగమును గానము చేయునప్పుడు భావములు అలలుగా వృద్ధి నొందును. దర్వులతో సహాయందు 125 తరంగములు కలవు.
యాత్ర :- తీర్ధులవారు కాశీనుండి దక్షిణభారతమునకు యాత్రార్ధము బయలుదేరునప్పుడు మార్గమధ్యమున ఒరిస్సా, తరువాత తూర్పుగోదావరి మండలమున గల కూచిమంచి వారి అగ్రహారము, విజయవాడకు సమీపమున గల ఆగిరిపల్లి, కృష్ణాజిల్లాలో కృష్ణానదీ తీరమునగల శ్రీకాకుళం, వేదాద్రి, అద్దంకి, మొదలగు అనేక గ్రామములు కేగి అచ్చటి దేవతలను ఆరాధించి ఆ ప్రాంత నామములతో కీర్తనలను రచించెను. అలాగే తిరువయ్యూరును కూడ దర్శించెను. కృష్ణ భక్తి అపారముగా గలిగిన శ్రీ నారాయణ తీర్థులవారు మాఘశుద్ధ అష్టమి నాడు పరమ పదించిరి
Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *